More
హిట్ 2

సినిమా రివ్యూ

Authored by

Thummala Mohan

| Samayam Telugu | Updated: 2 Dec 2022, 12:24 pm

నటులు:

అడివి శేష్,మీనాక్షి చౌదరి,రావు రమేష్,కోమలి ప్రసాద్,సుహాస్

దర్శకుడు: శైలేష్ కొలనుసినిమా శైలి:Telugu, Crime, Thrillerవ్యవధి:2 Hrs 0 Minరివ్యూ రాయండి

మూవీకు రేటింగ్ ఇవ్వడానికి స్లైడ్ చెయ్యండి

0.5 1 1.5 2 2.5 3 3.5 4 4.5 5

2.5/5

HIT2 Movie Review: న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దేశంతో ప్ర‌శాంతి త్రిపిర్‌నేనితో క‌లిసి హీరో నాని నిర్మాత‌గా మారారు. ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను హిట్ యూనివ‌ర్స్ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో భాగంగా వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై 2020లో వారు చేసిన సినిమా హిట్ ది ఫ‌స్ట్ కేస్‌. అందులో విశ్వ‌క్ సేన్ హీరో. ఆ సినిమా హిట్ కావ‌టంతో దానికి ఫ్రాంచైజీగా ‘హిట్ 2 ది సెకండ్ కేస్‌’ను రూపొందించారు. ఇందులో అడివి శేష్ హీరోగా న‌టించారు. ఫస్ట్ ప్టార్ట్ హిట్ కావ‌టంతో సెకండ్ పార్ట్‌పై మంచి అంచ‌నాలే క్రియేట్ అయ్యాయి. దానికి తోడు.. టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచేశాయి. మ‌రి హిట్ 2 ప్రేక్ష‌కుల‌ను నిజంగానే ఆక‌ట్టుకుందా? సెకండ్ కేస్‌ను డీల్ చేసిన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అడివి శేష్ పాత్ర ఎలా ఉంది? ఎలాంటి కేసుని సెకండ్ కేస్‌లో సాల్వ్ చేశారు అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. క‌థ‌:
వైజాగ్ సిటీలో హోమిసైడ్ ఇంట‌ర్‌వెన్ష‌న్ టీమ్‌కి సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్‌గా కృష్ణ దేవ్ అలియాస్ కె.డి (అడివి శేష్‌) పని చేస్తుంటారు. త‌న‌కు కాస్త వెట‌కారం ఎక్కువ‌. ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ క‌దా అని సీరియ‌స్‌గా ఉండ‌డు. కాస్త కూల్‌గా ఉంటూ త‌న ప‌ని తాను చేసుకుంటూ ఉంటాడు. ఆర్య (మీనాక్షి చౌద‌రి)ని ప్రేమిస్తాడు. ఇద్ద‌రు క‌లిసి లివ్ ఇన్ రిలేష‌న్‌షిప్‌లో ఉంటారు. కూల్‌గా ఉండే కె.డిని ఓ మ‌ర్డ‌ర్ కేసు టెన్ష‌న్ పెడుతుంది. ఓ ప‌బ్‌లో ప‌ని చేసే సంజ‌న అనే అమ్మాయిని ఓ సైకో కిల్ల‌ర్ చంపేసి త‌ల‌, కాళ్లు, మొండెం అంటూ ముక్క‌లు చేసేస్తాడు.

ఆ కేసుని ఇన్వెస్టిగేష‌న్ చేసే క్ర‌మంలో త‌ల మాత్ర‌మే సంజ‌నద‌ని, మిగిలిన బాడీ పార్ట్ మ‌రో ముగ్గురు అమ్మాయిల‌ద‌నే నిజం తెలిసి షాక‌వుతాడు కె.డి. అంటే నాలుగు హ‌త్య‌ల‌ను చేసిన ఆ సైకో కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోవ‌టానికి ఆధారాలు కూడా ఏవీ దొర‌క‌వు. ఉన్న ఆధారాలు మిస్ లీడ్ చేయ‌టంతో ఓ అమాయ‌కుడు చ‌నిపోతాడు. దాంతో కె.డి ఇంకా టెన్ష‌న్ ప‌డిపోతాడు. ఇంత‌కీ కె.డి ఆ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకున్నాడా? ఆ సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎందుకు అమ్మాయిల‌ను చంపుతుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:
సాధార‌ణంగా టాలీవుడ్‌లో ఫ్రాంచైజీలు తక్కువ‌. అందులో ఇలాంటి ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్స్‌ను ఫ్రాంచైజీగా చేయాలంటే చాలా ప్లానింగ్‌తో ముందుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ముందు నుంచే ఫ్రాంచైజీ ఆలోచ‌న‌తో ఉండ‌టంతో హిట్ 1 ది ఫ‌స్ట్ కేస్ ఇచ్చిన కిక్‌తో హిట్ 2 ది సెకండ్ కేస్‌ను తెరకెక్కించారు. క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు, మేజ‌ర్ వంటి చిత్రాల‌తో మెప్పించిన హీరో అడివి శేష్ త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో కూల్ కాప్‌గా ఆక‌ట్టుకున్నారు. ఇలాంటి థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను ఇది వ‌ర‌కే చేసి ఉండ‌టంవ‌తో శేష్ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే త‌న కె.డి పాత్ర‌లో ఒదిగిపోయారు. ఇక ఆయ‌న ప్రేయ‌సి ఆర్య పాత్ర‌లో మీనాక్షి చౌద‌రి బాగానే న‌టించింది. హీరోకి ఎమోష‌న‌ల్ సంద‌ర్భాల్లో స‌పోర్ట్ చేస్తూ చివ‌ర‌కు విల‌న్ చేత చిక్కి ఇబ్బందులు ప‌డే అమ్మాయి పాత్ర‌లో మంచి మార్కుల‌నే ద‌క్కించుకుంది. ఇక రావు ర‌మేష్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, సుహాస్‌, కోమ‌లి, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల్లో సూప‌ర్బ్‌గా న‌టించారు. కోడి బుర్ర‌తో సైకో కిల్ల‌ర్ హీరోను ఇబ్బంది పెట్టే స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి.

ఇక సాంకేతిక ప‌ర‌మైన విష‌యాల‌కు వ‌స్తే ద‌ర్శ‌కుడు శైలేష్‌ను ముందుగా అభినందించాలి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు టైట్ స్క్రీన్ ప్లే చాలా అవ‌స‌రం. అలాంటి స్క్రీన్ ప్లేతో హిట్ 2ను తెర‌కెక్కించారు శైలేష్‌. సినిమా నార్మ‌ల్‌గా స్టార్ట్ అయిన‌ప్ప‌టికీ రాను రాను సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇస్తాయి. చివ‌ర‌లో కిల్ల‌ర్ ఎవ‌ర‌నే విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు శైలేష్ చ‌క్క‌గా డీల్ చేసుకుంటూ వ‌చ్చి హిట్ 3కి హింట్‌ను ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో ఇచ్చారు. ఇక సంగీతం విషయానికి వ‌స్తే శ్రీలేఖ ట్యూన్ చేసిన ఎగిరే ఎగిరే రొమాంటిక్‌ సాంగ్ బావుంది. ఇక క్రైమ్ థ్రిల్ల‌ర్స్‌కు ప్రాణం పోసేది బ్యాగ్రౌండ్ స్కోర్‌. ఆ విష‌యంలో జాన్ స్టీవార్ట్ ఎడూరి ముఖ్య భూమిక‌ను పోషించారు. మ‌ణి కంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సినిమాలో కాస్త వ‌యొలెన్స్ ఎక్కువ‌గా క‌నిపించింది. కానీ క‌థ‌కు అది అవ‌స‌రం అనిపిస్తుంది. ఫస్ట్ సీన్‌కు సినిమాను మొత్తాన్ని న‌డిపించిన తీరుని అప్రిషియేట్ చేయాల్సిందే.

చివ‌ర‌గా.. ‘హిట్ 2’.. ఎంగేజింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

......
open >>
Listen