More
Narayana Murthy యూకే ప్రధాని అయిన అల్లుడు.. మామ తొలి రియాక్షన్ ...

Authored by Apparo GVN | Samayam Telugu | Updated: 25 Oct 2022, 1:22 pm

Narayana Murthy తన అత్తమామలు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి-సుధామూర్తి సాధించిన విజయాల పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని గతంలో రిషి సునాక్ స్పష్టం చేశారు. బ్రిటన్‌లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థల్లో ఇన్ఫోసిస్‌ కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. తాజాగా, అల్లుడి విజయంపై మామ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి- సుధామూర్తి కుమార్తె అక్షతను రిషి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ అమెరికాలో చదువుకునే సమయంలో ప్రేమలో పడ్డారు.

నారాయణమూర్తి-సునాక్

ప్రధానాంశాలు:

  • అక్షతా మూర్తిని వివాహం చేసుకున్న రిషి సునాక్
  • సునాక్‌పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి స్పందన
  • అల్లుడికి శుభాకాంక్షలు తెలియజేసిన మామ.
Narayana Murthy బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్ (Rishi Sunak) ఎంపిక కావడం పట్ల ఆయన మామ, ఇన్ఫోసిస్ (Infosys) సంస్థ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) మొదటిసారి స్పందించారు. రిషి ప్రధాని కావడం తమకు ఎంతో గర్వంగా ఉందని, ప్రధానిగా విజయం అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ‘‘శుభాకాంక్షలు రిషి... మేము నిన్ను చూసి గర్విస్తున్నాం.. మంచినేతగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం.. యూకే ప్రజల కోసం అతను తన వంతు కృషి చేస్తాడని మేము విశ్వసిస్తున్నాం’’ అని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. నారాయణమూర్తి కుమార్తె అక్షతను (Akshata Murthy) 2009లో రిషి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

ఫ్యాషన్ డిజైనర్ అయిన అక్షతా మూర్తి.. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఈ సమయంలో అక్షతా మూర్తిని రిషి కలిశారు. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే, రిషి గురించి అక్షత తన తండ్రి నారాయణమూర్తికి చెప్పినప్పుడు.. ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ రిషి సునక్‌తో మాట్లాడిన తర్వాత ఆయన ఆలోచన పూర్తిగా మారిపోయింది. వారి పెళ్లికి ఆయన మనసారా అంగీకరించారు. ఈ విషయాన్ని 'లెగసీ: లెటర్స్ ఫ్రమ్ ఎమినెంట్ పేరెంట్స్ టు దేర్ డాటర్స్' అనే పుస్తకంలో ఇన్ఫోసిస్ ఫౌండర్ ప్రస్తావించారు.

భారత సంతతికి చెందిన రిషి సునక్‌ బ్రిటన్‌కు కొత్త ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. యూకే ప్రధాని పదవిని చేపడుతోన్న మొదట శ్వేతజాతీయేతర వ్యక్తి రిషి. ఆయన పేరును కన్జర్వేటివ్ పార్టీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. పోటీ చేస్తామని ప్రకటించిన ఇద్దరూ తప్పుకోవడంతో రిషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

......
open >>
Listen